- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ సీఎం ప్రజెంటేషన్
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ ఎంపీల(Congress MP's)తో సమావేశం కానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ ఎంపీల(Congress MP's)తో సమావేశం కానున్నారు. తెలంగాణాలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే విధానంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు, పార్లెమెంటులో ఈ బిల్లు చట్టబద్ధత కోసం చర్చించాల్సిన అంశాలపై సీఎం ఎంపీలకు వివరించనున్నారు. కాగా ఈరోజు ఉదయం ఏఐసీసీ నేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతలతో తెలంగాణలో జరిగిన కులగణన, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాలను వారితో చర్చించారు.
ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ఈ సర్వే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు దారి తీసిందని.. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ను కేంద్రం అంగీకరించక తప్పదన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా సమాజంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ఇప్పుడు ఓబీసీలకు న్యాయం, సాధికారత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని పేర్కొన్నారు.






