- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : తెలంగాణ పౌరసరఫరాల సంస్థకు ISO సర్టిఫికెట్
తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో ఘనతను సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో ఘనతను సాధించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ(Civil Supply) అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సివిల్ సప్లయ్ సంస్థ సంస్కరణలపై అధ్యయనం చేసిన హెచ్ఎంవై.. సన్నబియ్యం పంపిణీ, సంస్థలో పలు మెరుగైన సేవలకుగాను ఐఎస్ఓ సర్టిఫికెట్(ISO Certificate0 ను అందించింది. ఫైవ్ స్టార్ రేటింగ్ తో కూడిన 9001 సర్టిఫికెట్ ను హెచ్ఎంవై అందజేయగా.. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) చేతుల మీదుగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చౌహాన్ సర్టిఫికెట్ అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు సన్నబియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని, దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. కేవలం అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఊరుకోకుండా.. ప్రతి బియ్యపు గింజ చివరి అర్హుని వరకు అందేలా ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. అలాగే సివిల్ సప్లయ్ ద్వారా నాణ్యమైన సరుకులు మాత్రమే సరఫరా చేస్తున్నామని, లబ్దిదారులకు నిజంగా లబ్ది చేకూరేలా పర్యవేక్షిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.






