- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు తెలంగాణ మంత్రివర్గ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని 6వ అంతస్తులో కేబినెట్ మీటింగ్ హాల్‌లో ఈ భేటీ జగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కేబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులందరూ తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, మూసీ పునరుజ్జీవనం ఫేజ్-1 (Musi Rejuvenation Phase-1) పనులు, వర్షాభావ పరిస్థితులు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంపై ‘ఎల్‌నినో’ ప్రభావం, లోటు వర్షపాతం నమోదు, రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేబినెట్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇటీవల గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రాలకు నోటీసులు ఇవ్వడం, కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, ఇతర రాష్ట్రాలతో చర్చించిన అంశాలపై సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ, పరిపాలనాపరమైన పరిణామాల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.






