Flash: కాళేశ్వరం జడ్జిమెంట్‌పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-23 13:12:45  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.

Flash: కాళేశ్వరం జడ్జిమెంట్‌పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై గతంలో వెలువడిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, న్యాయపరమైన అంశాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వ్యవహారంలో ఇటీవలే హైకోర్టు ఊహించని తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తేల్చింది. ఆయనతో పాటు.. ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఎస్ కే జోషిలకు కూడా ఈ కేసులో ఊరట లభించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రాజెక్టు రీ డిజైనింగ్, ఖర్చు, పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న చిక్కులు తొలగించుకోవడమే లక్ష్యంగా పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.

Next Story