- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అధ్యక్షతన ఇవాళ సచివాలయం (Secretariat)లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అధ్యక్షతన ఇవాళ సచివాలయం (Secretariat)లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, వారు విధించే పరోక్ష పన్నులపై కూడా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆదాయాన్ని మరింత పెంచే మార్గాలపై మంత్రలందరూ తమ అభిప్రాయాలను వెల్లడించి వాటిపై చర్చించనున్నారు. అదేవిధంగా ఆరు గ్యారంటీల అమలు, ఆయా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, రాష్ట్రంలో ఖరీఫ్ సాగు అంశాలు చర్చకు రానున్నట్లుగా సమాచారం.






