Cabinet sub committee: తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

by Prasad Jukanti |

తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది

Cabinet sub committee: తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం అయింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంపుపై చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పరోక్ష పన్నులపై చర్చిస్తున్నట్లు సమాచరం . ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుతో పాటు తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Next Story