TG News : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చంతా దానిచుట్టేనా?

by Muthe.Rajitha |

తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.

TG News : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చంతా దానిచుట్టేనా?
X

దిశ వెబన్ డెస్క్ : తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla)పై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏపీని చర్చలకు ఆహ్వానించనుంది తెలంగాణ సర్కార్. అలాగే స్థానిక ఎన్నికల(Local Body Election)పై కూడా ఈ భేటీలో చర్చించి, ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ముందస్తు సన్నాహాలపై దృష్టి సారించనున్నారు.

అదే విధంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపై చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, ధరణిపోర్టల్ అమలు, మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు, కుల గణన నివేదిక ఆమోదం వంటి ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అన్ని విభాగాల అధిపతులకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story