- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ప్రధాన అజెండా అదే!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీఎస్ రామకృష్ణా రావు, ప్రభుత్వం విప్‌లు, సలహాదారులు హాజరుకానున్నారు. సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీ.చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిచనున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.
అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లన కూడా బాధ్యులను చేసింది. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కాళేశ్వరం నిర్మాణం జరిగినట్లుగా కమిషన్ నోటిఫై చేసి క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేసినట్లుగా సమాచారం. 650 పేజీలతో కూడిన కాళేశ్వరం కమిషన్ నివేదికను స్టడీ చేసేందుకు ప్రభుత్వం న్యాయ కార్యదర్శి తిరుపతి, జీఏడీ కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటి పారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కూడా బ్రీఫ్ కమిటీని నియమించింది. వారు నివేదికపై అధ్యయనం చేసి ఆదివారం బ్రీఫ్ రిపోర్టును సీఎస్ రామకృష్ణా రావుకు అందజేయగా.. అయన ఇవాళ కేబినెట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ చర్చించనుంది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా పూర్తి నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టడంపై కూడా మంత్రివర్గ భేటీలో డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.






