నేడు తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే చాన్స్!

by Kema Shiva Kumar |

ప్రస్తుతం ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ (Hyderabad)కు చేరుకోనున్నారు.

నేడు తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ (Hyderabad)కు చేరుకోనున్నారు. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ రామకృష్ణా రావు, ప్రభుత్వం సలహాదారులు హాజరుకానున్నారు. అయితే, కేబినెట్ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి (GAD)కి పంపాలని రెండు రోజుల క్రితమే సీఎస్ అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేశారు.

నేటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కులగణన నివేదికపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ‘బీసీ’ ఆర్డినెన్స్‌ (‘BC’ Ordinance)ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కొసం ఢిల్లీలోని అటార్నీ జనరల్ పంపిన నేపథ్యంలో ఆ తర్వాత తలెత్తబోయే పరిస్థితులు, పరిణామాలపై డిస్కస్ చేయనున్నారు. గోశాల విధానంపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేయనున్నట్లుగా తెలుస్తోంది. వర్షాకాలం పంట సాగు ప్రారంభమైన నేపథ్యంలో యూరియా లభ్యత, డిమాండ్‌ను మంత్రివర్గం సమీక్షించనుంది. చివరగా ఆయా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి.. నిధులు సమకూర్చడంపై కేబినెట్ చర్చించనుంది.

Next Story