మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం.. డేట్స్ ఫిక్స్

by Gantepaka Srikanth |

మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం.. డేట్స్ ఫిక్స్

మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం.. డేట్స్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం(Telangana Cabinet) ముగిసింది. 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 25న మరోసారి సమావేశం కావాలని కేబినెట్‌లో నిర్ణయించారు. 50 శాతం రిజర్వేషన్‌పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్‌కు సిఫార్సు చేశారు. డెడికేషన్ కమిషన్ నివేదికను మళ్లీ కేబినెట్‌లో పెట్టి చర్చించనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్‌ ఆమోదించారు. అంతేకాకుండా గిగ్‌ వర్కర్ల రిజిస్ట్రేషన్‌, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్‌ ఆమోదించిందన్నారు. కవి అందెశ్రీ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించారు. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు హైదరాబాద్‌లో అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు, పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ రాసిన తెలంగాణ గీతం పెట్టాలని నిర్ణయించారు.

Next Story