- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశంపైనే చర్చ
by Gantepaka Srikanth |
తెలంగాణ మంత్రిమండలి(Telangana Cabinet) సమావేశానికి ముహూర్తం ఖరారైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రిమండలి(Telangana Cabinet) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 4వ తేదీన హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశం జరుగనుంది. కాళేశ్వరం కమిషన్ సమర్పించిన రిపోర్ట్‌పై మంత్రివర్గం చర్చించనుంది. కాగా, ఇప్పటికే కాళేశ్వరం నివేదిక సీఎం రేవంత్ వద్దకు చేరింది. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిటీ సమర్పించిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే సమయంలో నివేదిక అధ్యయనానికి ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. నివేదికను అధ్యయనం చేసి ముఖ్య సారాంశానికి కేబినెట్‌కు సమర్పించనుంది.
Next Story






