ఈనెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫుల్ క్లారిటీ వచ్చే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-21 10:01:01  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న సెక్రటేరియట్‌లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

ఈనెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫుల్ క్లారిటీ వచ్చే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25న సెక్రటేరియట్‌లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ అందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

Read More... స్థానిక ఎన్నికల వేళ.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

Next Story