- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Cabinet:ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ; అసెంబ్లీ బడ్జెట్, స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు జరగనున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (Telangana Cabinet Meeting) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతోంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీ (GHMC), ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ భేటీకి ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీస్థాయి సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ మొత్తం హస్తిన బాట పట్టనుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం వద్ద ఏం భేటీ జరగబోతోంది? కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.






