- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. కాసేపట్లో ప్రెస్ మీట్
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం(Cabinet Meeting) ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. మంత్రి శ్రీధర్ బాబు మినహా మిగతా కేబినెట్ మినిస్టర్స్ అంతా హాజరైన ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై భేటీలో కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధానాలు, రైతుల సమస్యలు, ఉచిత విద్యుత్, పంటల బీమా, రేషన్ కార్డుల జారీ, నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పోస్టుల మంజూరు, MBBS సీట్ల కేటాయింపులో స్థానికత వంటి కీలక అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని, ఆర్డినెన్స్ పై రాష్ట్రపతిని రాలవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా కేబినెట్ నిర్ణయాలపై మరికొద్దిసేపట్లో సచివాలయంలో పలువురు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.






