ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ!

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర

ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy) అధ్యక్షతన... సెక్రటేరియట్ లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది.

ఈ సందర్భంగా.. మంత్రులందరూ హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో.. లోకల్ బాడీ ఎన్నికలపై (Local body elections ) ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు ( High Court) ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పదో తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో.. ఈ అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

అలాగే వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో.. రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఈ వర్షా కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచించనున్నారు. అలాగే ఇతర సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లపై మరోసారి.. కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది అంటున్నారు.

Next Story