- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం.. ప్రధాన అజెండాగా మూడు అంశాలు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో 12.15కు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో 12.15కు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో విద్యుత్ శాఖ (Electricity Department)కు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండా ఉన్నాయి. రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవధంగా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై డిస్కస్ చేయనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) నిర్వహణపై విస్తృతంగా చర్చ జరగనుంది. చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ.. ఎన్నికల సంఘం సన్నద్ధతపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.






