ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ మంత్రి డుమ్మా!

by Muthe.Rajitha |   (  Updated:2025-07-28 10:04:44  IST  )

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం(Cabinet Meeting) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కాసేపటిక్రితమే ప్రారంభం అయింది.

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ మంత్రి డుమ్మా!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం(Cabinet Meeting) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కాసేపటిక్రితమే ప్రారంభం అయింది. సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధానాలు, రైతుల సమస్యలు, ఉచిత విద్యుత్, పంటల బీమా, రేషన్ కార్డుల జారీ, నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పోస్టుల మంజూరు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30, 2025 నాటికి ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా, బిసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.

ఈ బిల్లు ఒక కొలిక్కి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హాజరు కాలేదని సమాచారం. ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

Next Story