- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం.. వాటి కోసం రైతులు, నిరుద్యోగుల ఎదురు చూపులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర సచివాయంలో మంత్రులతో సమావేశం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana Cabinet meeting) తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర సచివాయంలో కేబినెట్‌తో సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వానాకాలం పంటలపై చర్చతో పాటు, భూ భారతిపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. (Kaleshwaram) కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, ఎన్‌డీఏ నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చతో పాటు.. వేములవాడలో కోడెలు మృతిపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని ప్రతిపక్షాలు, ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకం నిధుల విడుదలను ఆశిస్తున్నారు. రైతులు రైతు భరోసా తేదీల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆశతో ఉన్నారు.






