- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాతే కేబినెట్ భేటీ.. రిజల్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు
రాష్ట్ర కేబినెట్సమావేశం ఈనెల 15న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్సమావేశం ఈనెల 15న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూబ్లీహిల్స్ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఈనెల 14న జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం కల్లా ఫలితం వెల్లడికానుంది. గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. తమకు అందిన సమాచారం.. పార్టీ శ్రేణులు, నాయకులు మంత్రుల ద్వారా సేకరించిన సమాచారంతో పక్కాగా గెలుస్తామని, భారీ మెజార్టీ ఖాయమనే అంచనాలో ఉన్నారు. బీఆర్ఎస్ఓడిపోతుందని తెలిసే నానాహంగామా చేస్తున్నదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉండగా, గెలుపు తర్వాత ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అందుకే ఓట్ల లెక్కింపు వరకు వేచిచూసి మరుసటి రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాంగ్రెస్ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవాలు, ఇతర పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రజల ఆమోదం ద్వారానే జూబ్లీహిల్స్ఎన్నిక ఫలితం వచ్చిందనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా ఈనెల 7న కేబినెట్సమావేశం జరగాల్సి ఉండగా, 12కు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. చివరికి ఈనెల 15న మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు చేశారు.






