- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. ప్రభుత్వం ముందు కవిత 4 డిమాండ్లు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత 4 కీలక డిమాండ్లు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి భేటీ కాబోతోంది. ఈ భేటీ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (TRS)పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి నాలుగు కీలక డిమాండ్లు చేశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలని తెలంగాణ భూభాగంలోని సమ్మక్క సాగర్ నుంచే గోదావరి - కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని తీర్మానం చేసి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తూ కేబినెట్‍లో తీర్మానం చేయాలి.. ఈ విద్యా సంవత్సరం నుంచే చట్టం అమలు చేయాలన్నారు. కొత్త లేబర్ కోడ్‍లు తెలంగాణలో అమలు చేయబోమని కేబినెట్‍లో తీర్మానం చేయాలన్నారు. కేకే కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా గుర్తింపు ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు జూన్ 2న 250 గజాల ఇంటి స్థలం పంపిణీని ప్రారంభించాలని, కేకే కమిటీ నివేదిక తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలు చేయాలని డిమాండ్ చేశారు.






