- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి తెలంగాణ కేబినెట్ స్థలం మార్పు.. ఈసారి ఎక్కడ ప్లాన్ చేశారో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, ఈ సమావేశాన్ని వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, ఈ సమావేశాన్ని వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 21వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో 'సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్రంలోని మెజార్టీ మంత్రులు హాజరుకానున్నారు. మంత్రులంతా పుష్కరాల పనుల్లో నిమగ్నమవ్వడం, బాసరకు వెళ్లనుండటంతో.. అదే రోజు నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీని కేవలం వాయిదా వేయడమే కాకుండా, ఈసారి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 23వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (యాదాద్రి)లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. పాలనా వికేంద్రీకరణతో పాటు ప్రాంతీయ ప్రాధాన్యతలను గుర్తించేలా రాజధాని హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీలు నిర్వహించడం సీఎం రేవంత్ రెడ్డికి ఇది కొత్తేమీ కాదు. గతంలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, అక్కడికక్కడే జాతర ఏర్పాట్లు, నిధులపై కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు యాదగిరిగుట్టలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, స్థానిక అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






