- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని జిల్లా కలెక్టరేట్లలో వాటి ఏర్పాటుకు డెసిషన్!
తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram) విచారణ విషయంలో తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. పీసీ ఘోష్ కమిషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ మినిట్స్‌తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తూ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేయాలని, అలాగే రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవాలు జరపాలని నిర్ణయించింది. క్రీడా లోకం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇదే కాగా ముగ్గురు కొత్త మంత్రులు వివేక్, శ్రీహరి, లక్ష్మణ్ తొలిసారి హాజరయ్యారు.
కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ..
ప్రస్తుతం ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు పలు అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చిస్తోంది. బనకచర్ల విషయంలో చర్చలకు తాము సిద్ధమేనని సీఎం ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంలో తదుపరి కార్యాచరణపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఉత్కంఠంగా మారింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ అలైన్‌మెంట్‌కు ఆమోదం, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూముల అంశంతోపాటు రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ వంటి వాటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.






