- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో మాదిగ ఎమ్మెల్యేలు.. ఇవాళ ఎవరిని కలవనున్నారో తెలుసా?
తెలంగాణ మంత్రివర్గ పంచాయితీ ఢిల్లీకి తాకింది. నలుగురు తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్(ధర్మపురి), మందుల సామెల్(తుంగతుర్తి), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), లక్ష్మీ కాంతారావు(జుక్కల్) హస్తినలో మకాం వేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మంత్రివర్గ పంచాయితీ ఢిల్లీకి తాకింది. నలుగురు తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్(ధర్మపురి), మందుల సామెల్(తుంగతుర్తి), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), లక్ష్మీ కాంతారావు(జుక్కల్) హస్తినలో మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు కేసీ వేణుగోపాల్‌ను కలిసి కోరనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని మాదిగ సమాజం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ వస్తోందన్నారు.
తెలంగాణలో మాదిగ సామాజికవర్గం పెద్ద వర్గమని తెలిపారు. తమ సామాజికవర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే కేబినెట్లో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి ఉండాలన్నారు. మాదిగ సామాజిక వర్గంలో ఏ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని నలుగురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మాలలకు కేబినెట్లో స్థానం కల్పించడంపై తమకేలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సమాచారం ఇచ్చే ఢిల్లీకి వచ్చామని చెప్పారు.






