- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఎస్సీ వర్గీకరణ(SC Classification) ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) ఆమోదం తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ(SC Classification) ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం(Telangana Secretariat)లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అయింది. ఇందులో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపగా.. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాదు.. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Assembly Budget Meetings) ప్రారంభమయ్యే తేదీ, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను సైతం ఈ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేయనున్నారు.






