ఏది చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ టాలెంట్.. ఆవిర్భావ సభపై బీజేపీ ఆరోపణలు

by Ramesh Naini |

ఏది చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ పార్టీ టాలెంట్ అని తెలంగాణ బీజేపీ (Telangana BJP) తీవ్ర విమర్శలు చేసింది.

ఏది చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ టాలెంట్.. ఆవిర్భావ సభపై బీజేపీ ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏది చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ (BRS) పార్టీ టాలెంట్ అని తెలంగాణ బీజేపీ (Telangana BJP) తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధికార ఖాతా ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘హెచ్‌సీయూ వర్సిటీ భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల అటవీ ప్రాంతం కోసం నెత్తి, నోరు కొట్టుకున్నాం అని రెండు రోజుల క్రితం వరకు మొసలి కన్నీరు కార్చిన బీఆర్ఎస్ పార్టీ.. తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి పచ్చని పంటలకు అవసరమయ్యే సాగు కాల్వలను ధ్వంసం చేశారు, వాహనాల పార్కింగ్ కోసం వాగులు, వంకలు పూడ్చి వేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అసలు స్వరూపం. వన్యప్రాణులపై గుండె కరిగింది అని దొంగ నాటకాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు రైతన్నలపై కటువుగా మారింది’ అని తీవ్ర ఆరోపణలు చేసింది.

కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS formation) ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభ వేడుకలను ఘనంగా నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలోనే సభ ఏర్పాటులో భాగంగా సభ ప్రాంగణంలో విశాలమైన స్థలం కోసం చెట్లు నరికారని, పార్కింగ్ సౌకర్యం కోసం వాగులు పూడ్చి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరానగర్, గోపాల్ పూర్, ఎల్కతుర్తి రోడ్డులో స్థలాలు చదును చేసినట్లు, దేవాదుల 1ఆర్, 2ఆర్‌డీ 6 ఉపకాల్వలను 20 చోట్ల పూడ్చి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Next Story