TBJP: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీ బీజేపీ స్పీడ్.. రేపు కిషన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం

by Prasad Jukanti |

రేపు కిషన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం కానున్నది.

TBJP: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీ బీజేపీ స్పీడ్.. రేపు కిషన్ రెడ్డి అధ్యక్షతన  కీలక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికల హీట్ పెరుగుతోంది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ(T BJP) లు సై అంటే సై అంటున్నాయి. ఈ మూడు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడమే టార్గెట్ గా పని చేస్తున్న కమలం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ రేపు కీలక సమావేశం నిర్వహించబోతున్నది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన రేపు బీజేపీ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు హాజరుకాబోతున్న ఈ మీటింగ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేరువయ్యేలా ప్రణాళికలపై డిస్కషన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story