- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికలు: తెలంగాణ బీజేపీ కీలక ముందడుగు
సర్పంచ్ ఎన్నికలు: తెలంగాణ బీజేపీ కీలక ముందడుగు

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ(Telangana BJP) రాష్ట్ర స్థాయి సంఘటనాత్మక కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు ఎన్. రాంచందర్ రావు(Ram Chander Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు. పార్టీ బలోపేతం దిశగా మన ప్రయాణంలో ఇది ఒక కీలక అడుగు అని అన్నారు. ఈ కార్యశాలలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణ, రాబోయే ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవ్వడంతో పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. సంఘటిత శక్తి – విజయానికి మూలమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ విజయం కోసం ప్రతిఒక్కరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు ఇటీవలే తెలంగాణ బీజేపీలో జిల్లాల బాధ్యతల్లో కీలక మార్పులు చేశారు. జిల్లాల వారీగా కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ నియామకాలతో పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తన సంస్థాగత బలాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ట్వీట్






