- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుతో తెలంగాణ బీజేపీ ఎంపీల భేటీ!.. గొడం నగేష్ తో చంద్రబాబు చమత్కారం
టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీలుగా ఎన్నికైన మెదక్ అభ్యర్ధి రఘునందర్ రావు, ఆదిలాబాద్ అభ్యర్ధి గోడం నగేష్ లు చంద్రబాబును కలిసి, ఆయనతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోడం నగేష్ ను హత్తుకొని చమత్కరించారు. గోడం నగేష్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించాడని, ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక నాయకులను కాదని నగేష్ కు సీటు ఇచ్చానని, అయినా గెలిచి ఆ సమయంలో రికార్డు సృష్టించాడని కొనియాడారు.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో గోడం నగేష్ బోధ్ నియోజవర్గం టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి శాసన సభలో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పలు పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి 2014 లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచాడు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బీజేపీ లో చేరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.






