- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్థానిక ఎన్నికలకు మేం రెడీ’.. బీజేపీ MP ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీజేపీ చాలా బలంగా ఉందని.. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టులో కేసు ఓడిపోయి ఎన్నికలు వాయిదా వేసే కుట్రకు కాంగ్రెస్ తెరదీసినట్లు కనిపిస్తోంది. అందుకే కోర్టులో బలమైన వాదనలు వినిపించలేదని విమర్శించారు. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది.






