వెంకయ్య నాయుడిపై TG బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-01 13:09:10  IST  )

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(Paidi Rakesh Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వెంకయ్య నాయుడిపై TG బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(Paidi Rakesh Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికలో చంద్రబాబు పాత్ర ఉందని.. చంద్రబాబు మనిషి కాబట్టే రాంచందర్‌కు అవకాశం ఇచ్చారని పలు మీడియా ఛానళ్లలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కథనాలపై మంగళవారం రాకేశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో చాలా వరకు వెంకయ్య నాయుడు, చంద్రబాబుకు సంబంధించిన ఛానల్సే ఉన్నాయి. అందుకే ఇలాంటి కథనాలు వేస్తున్నారు. ఇలాంటి న్యూస్‌లను ప్రజలు నమ్మరు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు ఇంట్లో లేవలేకుండా అయ్యిండు.. ఇంకో నాలుగేళ్లు అయితే చంద్రబాబు నాయుడు కూడా లేవడు’ అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, స్వయంగా బీజేపీ మనిషి అయిన వెంకయ్య నాయుడుపై రాకేశ్ రెడ్డి విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై బీజేపీ అధిష్టాణం ఎలా స్పందిస్తుందో అని ఆసక్తి నెలకొంది.

Next Story