కమ్యూనిస్టు పార్టీపై తెలంగాణ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-10 11:48:46  IST  )

ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్‌(BRS)లు కుమ్మక్కయ్యాయని తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) ఆరోపించారు.

కమ్యూనిస్టు పార్టీపై తెలంగాణ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్‌(BRS)లు కుమ్మక్కయ్యాయని తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ(Deepa Dasmunsi) ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య డూప్ ఫైట్ ఉండేది.. ఇప్పుడు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వచ్చాక అసలు ఫైటే లేదని ఎద్దేవా చేశారు. సీపీఐ పార్టీ తాకట్టు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీని ఎప్పుడో కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయని.. ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేశారని అన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.


కాగా, తెలంగాణలో ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింట్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మల్క కొమురయ్య(Teachers MLC), అంజిరెడ్డి(Graduate MLC)లు ఎమ్మెల్సీలుగా గెలుపొందారు.

Next Story