- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వారి ట్రాప్‌లో పడొద్దు’.. అధికార ప్రతినిధులకు టీ.బీజేపీ చీఫ్ సూచన
అధికార ప్రతినిధుల పనితీరుపై హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao) సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: అధికార ప్రతినిధుల పనితీరుపై హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao) సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని చెప్పారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల ముందు పెట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలపై ప్రజల్లోనే అధికార పార్ట నేతలను నిలదీయాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరినీ కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు కూడా బీజేపీవైపే చూస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే.. అప్పుడు బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు.






