ట్రాఫిక్ ఎఫెక్ట్.. మెట్రోలో ప్రయాణించిన తెలంగాణ బీజేపీ చీఫ్

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా పలుచోట్ల శనివారం మధ్యాహ్నం వర్షం(Rain) కురిసిన విషయం తెలిసిందే.

ట్రాఫిక్ ఎఫెక్ట్.. మెట్రోలో ప్రయాణించిన తెలంగాణ బీజేపీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా పలుచోట్ల శనివారం మధ్యాహ్నం వర్షం(Rain) కురిసిన విషయం తెలిసిందే. కొద్దిపాటి వర్షానికే నగరంలో పలుచోట్ల రోడ్లపైకి వర్షంనీరు చేరింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. జనజీవనం అతలాకుతలం అయిపోయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘వర్షానికి రాష్ట్ర రహదారులతో సహా చిన్న గల్లీలు కూడా జలమయం అయిపోయాయి. అడుగు ముందుకు కదలలేకుండా విశ్వనగరం స్తంభించిపోయింది. దశాబ్దకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ(BRS) హైదరాబాద్ నగర రోడ్లు, ప్రభుత్వ రవాణా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా కాంగ్రెస్ పార్టీ(Congress Party) పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు ఈ జలమయమైన రోడ్లలో, అసురక్షితమైన - అసౌకర్యమైన రవాణా వ్యవస్థతో కష్టాలు పడుతూ పనికి వెళ్తున్న ప్రజల గురించి ఇరు పార్టీల ప్రభుత్వాలు ఒక్కసారైనా అలోచించి ఉంటే.. ఇవాళ హైదరాబాద్ నగర పరిస్థితి ఇలా ఉండేది కాదు’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశం అనంతరం మరో కార్యక్రమానికి వెళ్ళవలసి ఉండగా, దారిపొడవునా భారీ ట్రాఫిక్ ఏర్పడిన కారణంగా, మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో ద్వారా రాంచందర్ రావు ప్రయాణించారు.

Next Story