మయన్మార్ సైబర్‌ నేరాల శిబిరాల్లో 12 మంది తెలంగాణ పౌరులు.. వారి కోసం తెలంగాణ భవన్‌‌లో సన్నాహాలు

by Ramesh Naini |   (  Updated:2025-11-06 15:13:48  IST  )

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సూచనల మేరకు మయన్మార్ నుంచి భారత పౌరులను తీసుకొస్తున్న ప్రత్యేక భారత వాయుసేన (IAF) విమానం గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకోనుంది.

మయన్మార్ సైబర్‌ నేరాల శిబిరాల్లో 12 మంది తెలంగాణ పౌరులు.. వారి కోసం తెలంగాణ భవన్‌‌లో సన్నాహాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సూచనల మేరకు మయన్మార్ నుంచి భారత పౌరులను తీసుకొస్తున్న ప్రత్యేక భారత వాయుసేన (IAF) విమానం గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకోనుంది. ఈ ప్రత్యేక రక్షణ చర్యలో భాగంగా మయన్మార్‌ మయవాడీలోని సైబర్‌ నేరాల శిబిరాల్లో చిక్కుకున్న 270 మంది భారతీయులను ఆ దేశం నుంచి తిరిగి తీసుకొస్తున్నారు. వారిలో 12 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిని రేపు ఉదయం (నవంబర్ 7) విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఆయా రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అధికారికంగా అప్పగించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర పౌరులను స్వాగతించేందుకు, వారికి తాత్కాలిక నివాసం, ఆహారం, హైదరాబాద్‌కు సురక్షిత రవాణా సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ భవన్, న్యూఢిల్లీ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. వీరికి అధిక వేతనం ఆశ చూపించి, చివరికి సైబర్ గ్యాంగ్‌ల బారిన పడ్డవారని అధికారులు వెల్లడించారు. మయన్మార్-థాయిలాండ్ సరిహద్దు ప్రాంతంలో ఇలాంటి మోసపూరిత సంస్థల బారిన పడిన భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

Next Story