- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC Reservations Issue: హైకోర్టు ప్రాంగణంలో ఉండి స్వయంగా వాదనలు వింటున్న మంత్రులు
తెలంగాణ ప్రభుత్వ సూచనలు, సమగ్ర సమాచారం మేరకు బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Singhvi) వాదనలు వినిపిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ సూచనలు, సమగ్ర సమాచారం మేరకు బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Singhvi) వాదనలు వినిపిస్తున్నారు. సామాజిక న్యాయం అంశంపై భారత రాజ్యాంగ రూపకర్తల ఆశయాలు, కె.కృష్ణమూర్తి vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, సాహ్ని vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, పంజాబ్ కోర్టు తీర్పు మీద సమగ్రంగా సింఘ్వీ వాదనలు వినిస్తున్నారు. ఆయా తీర్పుల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లకు కల్పనను ఏ శక్తి ఆపలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ, 243-టీ ప్రకారం... రాజ్యాంగ రూపకర్తలు పేర్కొన్నట్టు.. సామాజికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే ఉందని కీలకంగా ప్రస్తావించారు.
అయితే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుగుతన్న కీలక తరుణంలో హైకోర్టు ప్రాంగణంలో ఉండి బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లు స్వయంగా వాదనలు వింటున్నారు.






