తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డ్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-29 13:13:14  IST  )

తెలంగాణ బతుకమ్మ(Telangana Bathukamma) పండుగకు అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(Guinness Book of Records)లో చోటు దక్కింది.

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బతుకమ్మ(Telangana Bathukamma) పండుగకు అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(Guinness Book of Records)లో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రకటన చేశారు. హైదరాబాద్‌‌లోని సరూర్‌ స్టేడియంలో సోమవారం సాయంత్రం గ్రాండ్‌గా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైదానంలో 63 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ 63 అడుగుల మెగా బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధిచింది. ఇదిలా ఉంటే.. లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ వేడుకలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహా మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. వీడియో

Next Story