- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం.. వెంటనే వాయిదా
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం అయిన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (Telangana Assembly) ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన వెంటనే.. కొద్దిసేపటికే ప్రత్యేక సమావేశాలు వాయిదా పడ్డాయి. మంత్రివర్గ భేటీ దృష్ట్యా వాయిదా వేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పీకర్‌ను కోరారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచర మంత్రులు కేబినెట్‌లో ఉన్నారని, నోట్స్, మినిట్స్ తయారీకి సమయం పడుతుందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత కొనసాగనున్న సమావేశం.
కాగా, కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో చర్చకు పెట్టే నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్‌లో నివేదికలకు ఆమోదం చర్చలు జరుగుతున్నాయి.






