- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) రెండవరోజు తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) తిరిగి ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో రెండవరోజు తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) స్పీకర్(Speaker) పై చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. సభలో ఇరుపక్షాల మధ్య పోటాపోటి నినాదాలు, వాగ్వాదం జరగడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad kumar) సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల వినతి మేరకు తిరగి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు స్పీకర్. అయితే సభలో ఉదయం జరిగిన తీవ్ర వాగ్వాదం, గందరగోళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారీగా మార్షల్స్ ను మోహరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి "స్పీకర్ శాసనసభ సభ్యుల అందరి తరపున పెద్ద మనిషి అంతేగాని సభ మీ ఒక్కరిదే కాదు" అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ దళితుడు కాబట్టే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్పీకర్ ను అగౌరవపరిచేలా మాట్లాడలేదని బీఆర్ఎస్ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్ కు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఈ విషయమై సభలో ఇరు పార్టీల సభ్యులు పొటాపోటీగా నినాదాలు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశాడు.






