- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
by Muthe.Rajitha |
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రేపటికి వాయిదా పడ్డాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రేపటికి వాయిదా పడ్డాయి. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్టు స్పీకర్ తెలిపారు. కాగా లగచర్ల ఘటన(Lagacharla Issue)పై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగినప్పటికీ.. నిరసనల మధ్యే మూడు కీలక బిల్లులను సభ ఆమోదించింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, స్టేట్ జీఎస్టీ సవరణ బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం జరిగింది. తెలంగాణ పర్యాటక విధానంపై కొద్దిసేపు చర్చ జరిపిన అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Next Story






