- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ, మండలి వాయిదా
శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దానిపై ప్రసంగించిన అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవ్వగా.. రూ.3,24,234 కోట్లతో రూపొందించిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. ఏ రంగానికి ఎంతెంత కేటాయిస్తున్నారన్న వివరాలను వెల్లడించారు. ఓ వైపు బడ్జెట్ పై భట్టి విక్రమార్క ప్రసంగిస్తుండగానే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేలా లేదని విమర్శిస్తూ.. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ, మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా.. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి సభలో వెల్లడించారు. అంబేడ్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో అత్యధిక ఆర్థిక శాఖ, ఆరు గ్యారెంటీలకు అత్యధిక కేటాయింపులు ఇచ్చారు. ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు, ఆర్థికశాఖకు రూ.60,438 కోట్లు కేటాయించారు.






