- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jupally: తెలంగాణకు ఆ సామర్థ్యం ఉంది
పర్యాటకుల, పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరిస్తామని, ఘనమైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకు వెళ్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటకుల, పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరిస్తామని, ఘనమైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకు వెళ్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో జర్మన్ ఫ్రీడరిక్ ఎబర్ట్ స్టిఫ్టంగ్ (ఎఫ్ఈఎస్) ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్, మిర్కో గుంథర్ , క్రిస్టోఫ్ మోహ్ర్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన పర్యాటక విధానం, పర్యాటక రంగంలో పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. తెలంగాణ నూతన పర్యాటక విధానంలోని ముఖ్య లక్ష్యాలు, పెట్టుబడిదారులకు కల్పించే ప్రోత్సాహకాలు, విధానపరమైన సరళత గురించి మంత్రి వివరించారు. రాష్ట్రం పర్యాటక రంగంలో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంలో జర్మన్ నైపుణ్యం, పెట్టుబడులు మాకు సహాయపడతాయి. మా నూతన పర్యాటక విధానం విదేశీ పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.






