- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలు: సీతక్క
రాష్ట్రంలో త్వరలో తెలంగాణ పోషకాహార ప్రణాళిక తీసుకురాబోతున్నామని మంత్రి సీతక్క చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ అంగన్ వాడీ కేంద్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. పోషకాహార తెలగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్ లో పని చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్ వాడీ (Angan Wadi) సేవల బలోపేతం, చిన్నారులలో పోషకాహర మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి సమావేశం బేగంపేట టూరిజం ప్లాజాలో ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కు అనుగుణంగా అంగన్ వాడీ సేవలను మరింత మెరుగు పరుస్తామని చెప్పారు.
తెలంగాణ పోషకాహార ప్రణాళిక:
త్వరలోనే తెలంగాణ పోషకాహార ప్రణాళిక (Nutrition Telangana) రూపొందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. పోషకాహార తెలంగాణ నిర్మాణం దిశగా సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. నిపుణుల అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా పోషణ తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని, సమిష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యపడుతుందని తెలిపారు. అంగన్ వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మిల్లీ లీటర్ల పాలు, కిశోర బాలికలకు పోషకాలతో కూడిన పల్లి, తృణధాన్యాల పట్టీలు, వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకాలతో కూడిన ఎగ్ పంపిణీని నిలిపివేశారని సీతక్క చెప్పారు. నిపుణుల సలహాల మేరకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలు అన్ని వయసుల వారికి పౌష్టికాహారం అందించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. తెలంగాణలో పోషకారలోపాన్ని అధిగమించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
వలస కూలీల పిల్లల కోసం మొబైల్ అంగన్ వాడీ సెంటర్లు
ఇక నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్ వాడీలను ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. నాక్, జేఎన్టీయూ వంటి సంస్థలు మోడల్స్ సిద్ధం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో వలస కూలీల పిల్లలకు పౌష్టికాహరం అందించేలా మొబైల్ అంగన్ వాడీలను నిర్వహిస్తామన్నరాు. వారానికి కనీసంరెండు సార్లు ఆయా ప్రాంతాల్లో పోషకాహారాన్ని అందించనున్నామన్నారు. అంగన్ వాడీ కేంద్రాలను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తి చూపాయని నేపథ్యంలో అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సీతక్క ప్రత్యేకంగా పోషన్ వాటిక కార్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్ ను ఆవిష్కరించారు. మొదటి విడతలో 4500 అంగన్ వాడీ కేంద్రాలకు ఈ కిట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.






