- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీలు స్టార్టయే.. పర్మిషన్ రాదాయే!
రాష్ట్రంలో కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ పూర్తయ్యాయి. కానీ ఇంటర్మీడియట్ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కంప్లీట్ కాలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ పూర్తయ్యాయి. కానీ ఇంటర్మీడియట్ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కంప్లీట్ కాలేదు. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు అన్ని కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 2 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలతో పాటు గురుకులాల్లోనూ ఫస్టియర్, సెకండియర్ క్లాసెస్ మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు 1,126 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. అందులో ప్రైవేట్, కార్పొరేటు కాలేజీలు 230 మాత్రమే ఉన్నాయి. గతంలో మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉండే కాలేజీల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా ఎక్కువగా ఉండటంతో పిల్లల భవిష్యత్ కోసం ఇవ్వాలని చాలా మేనేజ్ మెంట్లు కోరడంతో అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇలా అదే ధీమాతో ప్రతి విద్యాసంవత్సరం ప్రైవేటు కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి.
తాము చేరే కాలేజీకి గుర్తింపు ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదని, తమ ఇష్టపూర్వకంగానే కాలేజీలో చేరుతున్నట్లు విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకలేఖలు రాయించుకోవాలని కొన్నిసార్లు సూచించిన సంఘటనలు ఉన్నాయి. ఈ కారణంగానే అందులో ఏ కాలేజీకి గుర్తింపు ఉందనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారికంగా వెల్లడించాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఇటీవలే ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. అందులో భాగంగానే 226 వర్కింగ్ డేస్, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు, వచ్చే జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, వచ్చే ఏడాది మార్చి ఫస్ట్ వీక్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.






