- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"నాకు ఆ విషయం తెలీదు".. బాలయ్యకు తెలంగాణ హోంశాఖ సీఎస్ క్షమాపణలు
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్, మాజీ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్, మాజీ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇందుకు రెండు ఫ్యాన్స్ గ్రూపుల మధ్య జరిగిన గొడవలో.. తనను టార్గెట్ చేయడం కారణమని వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్లో మూవీ పైరసీ ముఠాలను అరికట్టేందుకు సినీ ఇండస్ట్రీలోని అగ్రహీరోలు, దర్శక, నిర్మాతలు, డిజిటల్ సినిమా కంపెనీలతో హైదరాబాద్ నగర పోలీస్ సైబర్ క్రైమ్ టీమ్ తో సీవీ ఆనంద్ స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు అనేకమంది హాజరయ్యారు. దీనిపై ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ పై ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. బాలకృష్ణను కూడా పిలవండి.. లేదంటే ఆయన అసెంబ్లీలో అడుగుతారన్నాడు. దానికి ఒక స్మైలీ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఇదే బాలయ్య అభిమానులకు కోపం తెప్పించింది. అగ్రనటుడు, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ పట్ల అలా కామెంట్ చేయడం సరికాదని, తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా దీనిపై స్పందించిన సీవీ ఆనంద్.. ఆ స్మైలీ ఎమోజీ పోస్ట్ చేసిన విషయమే తనకు తెలియదని వివరణ ఇచ్చి.. బాలకృష్ణకు క్షమాపణలు చెప్పారు. "దాదాపు రెండు నెలల క్రితం పోస్ట్ చేసిన ఎమోజి కోసం, బాలయ్య అభిమానులు, ఆయన విమర్శకులు ఒకరితో ఒకరు గొడవ పడటం, ఆ గొడవలో నన్ను టార్గెట్ చేయడం నేను గమనించాను. సమయం లేకపోవడం వల్ల, నగరంలోని వివిధ సంఘటనలు, కేసులు, ఇతర సమస్యలను X , instaలో పోస్ట్ చేయడానికి నా సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఉండేవాడు. ఈ విషయంపై సెప్టెంబర్ 29న జరిగిన ప్రెస్ మీట్ తర్వాత, బాలయ్యపై పోస్ట్ చేసిన పోస్ట్‌కు సమాధానంగా అతను ఒక ఎమోజిని పోస్ట్ చేశాడు. అది పూర్తిగా అనవసరం. అతను అలా చేయకూడదు. ఇప్పటివరకు నాకు దాని గురించి తెలియదు. ఈ వివాదం గురించి తెలుసుకున్న తర్వాత, నేను ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాను. వివరాలు తెలుసుకుని బాలయ్యకు సందేశం కూడా పంపాను ఎందుకంటే నాకు ఆయన చాలా దశాబ్దాలుగా తెలుసు. అది ఆయనను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కూడా కోరుతున్నాను. నేను.. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ , నాగార్జునల సినిమాలు చూస్తూ , ఆస్వాదిస్తూ పెరిగాను. వారందరితో నాకు గొప్ప గౌరవం, స్నేహం ఉన్నాయి. మరో రెండు లేదా మూడు తప్పుడు పోస్ట్‌లు/ప్రత్యుత్తరాలలో, నేను గత నెలలోనే ఆ హ్యాండ్లర్‌ను తొలగించాను. అందుకే మీరు ఇప్పుడు నా పోస్ట్‌లను తక్కువగా చూస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో చాలా తక్కువ ప్రత్యుత్తరాలు కనిపిస్తున్నాయి. దయచేసి దీన్ని ఇక్కడ, ఇప్పుడే ముగించమని నేను ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు" అని సీవీ ఆనంద్ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.






