జెండా ఎగరవేద్దాం.. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

పార్టీ ప్రకటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కీలక వ్యాఖ్యలు చేశారు.

జెండా ఎగరవేద్దాం.. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ప్రకటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లు రెడ్డి, వెలమ పార్టీలని మల్లన్న అన్నారు. బీసీల కోసం త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్ల పదవిలో బీసీలు ఉండాలి. బీసీల రాజకీయ పార్టీ రాబోతోంది. బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరవేద్దాం. మన టికెట్లు మనం ఇచ్చుకుని, మన పదవులు మనమే ఇచ్చుకుందాం' అని మంచిర్యాలలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో బీసీ బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారులను వదిలిపెట్టను వదిలిపెట్టను. బీసీలపై ఈగ వాలినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా అని మండిపడ్డారు.

Next Story