42శాతం BC రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్.. తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-09 11:26:32  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ( TG HighCourt) స్టే విధించిన విషయం తెలిసిందే.

42శాతం BC రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్.. తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ( TG HighCourt) స్టే విధించిన విషయం తెలిసిందే. జీవో అమలును నిలిపివేస్తూ గురువారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) స్పందించారు. శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బలహీనమైన జీవోతో బీసీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని రెచ్చిపోయారుర. రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.

Next Story