Teenmar Mallanna: మరికాసేపట్లో తీన్మార్ మల్లన్న కొత్తపార్టీ.. తాజ్ కృష్ణ వద్ద హై టెన్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-09-17 06:27:26  IST  )

మరికాసేపట్లో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనగా ఆయన ఫ్లెక్సీలు దుండగులు చించివేయడం కలకలం రేపుతోంది.

Teenmar Mallanna: మరికాసేపట్లో తీన్మార్ మల్లన్న కొత్తపార్టీ..  తాజ్ కృష్ణ వద్ద హై టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) మరికాసేపట్లో బీసీ పార్టీ (BC New Party) అనౌన్స్ చేయబోతున్నారు. బంజారాహిల్స్ లో ని తాజ్ కృష్ణ (Taj Krishna) హోటల్ లో ఇవాళ బీసీ రాజకీయ పార్టీ ప్రకటిస్తానని తీన్మార్ మల్లన్న నిన్ననే వెల్లడించారు. ఆ మేరకు ఇవాళ పార్టీ ప్రకటన ఉంటుందని తాజ్ కృష్ణ వద్దకు పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న అభిమానులు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ నాయకులు చేరుకున్నారు. అయితే వారిని లోపలికి రానివ్వకుండా తాజ్ కృష్ణ హోటల్ యాజమాన్యం గేట్లు క్లోజ్ చేసింది. హోటల్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్లెక్సీలను సైతం దుండగులు చించివేయడం కలకలం రేపుతోంది. దీంతో హోటల్ తాజ్ కృష్ణ వద్ద ఒక్క సారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హోటల్ యాజమాన్యం తీరుపై తీన్మార్ మల్లన్న అభిమానులు, బీసీ నాయకులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బీసీ పార్టీ పెట్టకుండా అడ్డుకునేందుకు అగ్రవర్ణ నాయకులు చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదనిని వారు చెబుతున్నారు.

Next Story