- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Local Body Elections: గుర్తు, పోటీ అంశాన్ని పరిశీలించండి.. తీన్మార్ మల్లన్న పార్టీపై ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) పార్టీ గుర్తింపు, ఎన్నికల గుర్తును చట్టప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. ఇటీవల తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని (Telangana Rajyadhikara Party) స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్పిస్తూ తమ రాజకీయ పార్టీ గుర్తింపు, ఎన్నికల గుర్తు కేటాయించాలని తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ అబ్యర్థనను చట్టప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా బీసీలే ఎజెండాగా తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లన్న పార్టీకి ఎన్నికల గుర్తు విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో చూడాలి మరి.






