- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. ఆన్‍లైన్ టికెట్ల బుకింగ్‍కు అంతరాయం
శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ నిలిచిపోయింది. బుకింగ్ హిస్టరీలో టికెట్లు కనిపించక భక్తులు ఆందోళన చెందుతున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ క్షేత్రం శ్రీశైలం (Srisailam) దేవస్థానం వెబ్ సైట్‍లో సాంకేతిక సమస్య (Technical Issues) తలెత్తింది. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుకింగ్‍కు అంతరాయం ఏర్పడింది. బుక్ చేసిన టికెట్లు డౌన్ లోడ్ కాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. www.srisailadevasthanam.org ద్వారా దర్శనం, సేవలను భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే భక్తులు బుక్ చేసుకున్న టికెట్లు వెబ్ సైట్ బుకింగ్ హిస్టరీలో చూపించడం లేదు. ఈ సమస్యపై స్పందించిన ఆలయ వర్గాలు ఏపీ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు తెలిపారు.
Next Story






