మరో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 71 మంది ప్రయాణికులు?

by Naga Rani Yarlagadda |

గత రాత్రి హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణికులతో వెళ్లిన ఇండిగో విమానం రన్ వేపై ఎయిరిండియా విమానాన్ని ఢీ కొట్టింది.

మరో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 71 మంది ప్రయాణికులు?
X

దిశ, వెబ్‌డెస్క్: గత రాత్రి హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణికులతో వెళ్లిన ఇండిగో విమానం రన్ వేపై ఎయిరిండియా విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన కలకలం రేపింది. అప్పటికే ఇండిగోలో ప్రయాణికులు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మరో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ కు ముందే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయాణికులను అలర్ట్ చేశాడు. ఫ్లైట్ లో ఉన్న 71 మంది ప్రయాణికులను దించి.. టెక్నికల్ నిపుణులు తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి ఉదయం 6.45 గంటలకు ప్రయాణికులతో రాయ్ పూర్ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన జరిగింది. పైలట్ ఆ లోపాన్ని గమనించకపోయి ఉంటే.. ఏం జరిగి ఉండేదో ఊహించడానికే భయంకరంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.

Next Story